బ్రేకింగ్: 90 స్థానాల్లో జనసేన పార్టీ జండా ఎగరబోతుంది..!

By Siddhu Manchikanti, May 15, 2019 13:23 IST

బ్రేకింగ్: 90 స్థానాల్లో జనసేన పార్టీ జండా ఎగరబోతుంది..!
 
మొట్టమొదటిసారి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ పై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇటీవల విజయవాడలో సందడి చేసిన హైపర్ ఆది మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ 90 అసెంబ్లీ స్థానాలను గెలవడం ఖాయమని హైపర్ ఆది తేల్చిచెప్పేశారు.
 
తాజాగా జరిగిన 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించే క్ర‌మంలో ఏపీ వ్యాప్తంగా ప‌ర్య‌టించాన‌ని, ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌లంతా జ‌న‌సేన‌కు పాజిటివ్‌గానే రెస్పాండ్ అయిన‌ట్టు హైప‌ర్ ఆది మీడియాతో చెప్పుకొచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ప్ర‌చారం చేసేందుకు ఏ ఏరియాకు వెళ్లినా కూడా ప్ర‌జ‌లంతా మార్పు కోసం ప్ర‌య‌త్నించిన‌ట్టు తెలిసింద‌న్నారు. ఇక జ‌న‌సేన‌కు ఎన్నిసీట్లు వ‌స్తాయ‌న్న ప్ర‌శ్న‌కు హైప‌ర్ ఆది స్పందిస్తూ తాను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని అనుకుంటున్నాన‌ని, అందుకు త‌గ్గ సీట్లు వస్తాయ‌ని, మొత్తంగా జ‌న‌సేన‌కు 90 సీట్లు వ‌స్తాయ‌ని తాను భావిస్తున్న‌ట్టు హైప‌ర్ ఆది చెప్పారు.


Latest News

view all