డార్లింగ్ ఇన్ స్టా ఎంట్రీ అదిరింది!

By Xappie Desk, April 13, 2019 13:54 IST

డార్లింగ్ ఇన్ స్టా ఎంట్రీ అదిరింది!
 
‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత ప్రభాస్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అభిమాన హీరో గురించిన కొత్త కొత్త అప్‌డేట్స్‌ను తెలుసుకోవాలని ఫ్యాన్స్‌ అంతా అనుకుంటారు. అభిమానులు అంతలా కోరుకుంటే డార్లింగ్‌ ఎందుకు కాదనడు. ఫోటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేశారు.
 
సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు మరింత దగ్గర అవుతుంటారు స్టార్స్‌. ఫేస్‌బుక్, ట్వీటర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా అన్ని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో తమ లేటెస్ట్‌ సినిమా అప్‌డేట్స్‌ దగ్గర నుండి తమ డే టు డే విశేషాలను డైరెక్ట్‌గా తెలియపరుస్తుంటారు.
 
లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్‌ అయ్యారు. అందులో తొలి ఫొటో కూడా పోస్ట్‌ చేయకముందే సుమారు 7 లక్షల మంది ఫాలోయర్స్‌ ప్రభాస్‌ని ఫాలో కావడం విశేషం. దీన్నిబట్టి ప్రభాస్‌కి ఏ రేంజ్‌లో క్రేజ్‌ ఉందో ఊహించుకోవచ్చు.
 
మాంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరో కాబట్టి ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ కూడా అదిరిపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తోన్న సాహో’ చిత్రం ఆగస్ట్‌ 15న రిలీజ్‌ కానుంది. సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు.

Tags:

  • Prabhas
  • Instagram
  • Saaho

Latest Boxoffice Articles

view all