రకుల్ ప్రీత్ కి లైఫ్ లాంగ్ మర్చిపోలేని బంపర్ ఆఫర్ తగిలింది?

By Siddhu Manchikanti, July 24, 2019 14:45 IST

రకుల్ ప్రీత్ కి లైఫ్ లాంగ్ మర్చిపోలేని బంపర్ ఆఫర్ తగిలింది ?
 
కోలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టించింది. దేశంలో లంచం అనేది లేకుండా అన్న కాన్సెప్ట్ పై శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమా కమలహాసన్ కెరియర్లోనే అత్యంత కలెక్షన్లు రాబట్టిన సినిమాగా పేరు తెచ్చుకుంది. భారతీయుడు మొట్ట మొదటి భాగంలో కమల్ హాసన్ డబల్ యాక్షన్ లో నటించడం మనం చూశాం.
 
తండ్రీకొడుకులుగా తెరకెక్కిన మొదటి భాగంలో కొడుకు కమలహాసన్ చనిపోతాడు. తండ్రి కమల్ హాసన్ మాత్రం మిగిలిపోతాడు. ఈ నేపథ్యంలో తాజాగా తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలో కమల్హాసన్ హీరోగా నటిస్తుండగా మరో పక్క విలన్‌గా అక్షయ్ కుమార్ ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు సౌత్ స్టార్స్ శింబు, దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, నయనతార ముఖ్యమైన పాత్రలలో నటించబోతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్ నుండి కాజల్ అగర్వాల్ బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. అంతేకాకుండా కాజల్ అగర్వాల్ ప్లేసులో క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి శంకర్ అవకాశం ఇచ్చినట్లు వార్తలు సోషల్ మీడియాలో రావడంతో రకుల్ ప్రీత్ కి లైఫ్ లాంగ్ మర్చిపోలేని బంపర్ ఆఫర్ తగిలింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్ల చేస్తున్నారు. ఇంత క్రేజియస్ట్ భారీ ప్రాజెక్టు లో రకుల్ కి ఛాన్స్ దొరకడం నిజంగా అదృష్టమే అంటూ సౌత్ ఇండస్ట్రీ కి చెందిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Latest News

view all