చిరంజీవి ఐదు రోజులు నాకు టైమ్ ఇస్తే చాలు.. సంచలన విషయం బయట పెట్టిన పూరీ!

By Siddhu Manchikanti, July 24, 2019 14:52 IST

చిరంజీవి ఐదు రోజులు నాకు టైమ్ ఇస్తే చాలు... సంచలన విషయం బయట పెట్టిన పూరీ!
 
పూరి జగన్నాద్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి రావడంతో పూరి జగన్నాథ్ అభిమానులు ఎంతగానో సంతోష పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి చాలా ఫ్లాపులు చూసిన పూరి జగన్నాధ్...తో సినిమాలు చేయటానికి అప్పట్లో తాను బ్లాక్ బస్టర్ ల్లు ఇచ్చిన హీరోలే పూరితో సినిమా అంటే మొన్నటి వరకు మొహం తిప్పేసుకున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఎప్పుడు సూపర్ డూపర్ హిట్ కావడంతో పూరి తో సినిమా చేయడానికి ఎగబడుతున్నారు.
 
ఇటువంటి క్రమంలో ఇటీవల సక్సెస్ సంబరాలలో భాగంగా.. పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి అనేక విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తో చేయాల్సిన సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. గతంలో చిరంజీవితో ఆటో జానీ సినిమా చేస్తున్నట్లు వచ్చిన వార్తల విషయంపై పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...చిరంజీవి గారిని ఆటో జానీ సినిమా స్క్రిప్ట్ లో కొంత తేడా వచ్చిందని..అంటూ 'ఇప్పడైనా చిరంజీవి గారు నన్ను పిలిస్తే ఐదు రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేసి డైరెక్ట్ చేసేందుకు రెడీ గా ఉంటాను' అంటూ తన స్టైల్ లో చెప్పుకొచ్చారు. మరి చిరంజీవి పూరి జగన్నాథ్ కి అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

Latest News

view all