‘సైరా’ ట్రైలర్ కోసం సూపర్ ప్లాన్ వేసిన ప్రొడ్యూసర్ రామ్ చరణ్…!

By Siddhu Manchikanti, July 28, 2019 16:50 IST

‘సైరా’ ట్రైలర్ కోసం సూపర్ ప్లాన్ వేసిన ప్రొడ్యూసర్ రామ్ చరణ్…!
 
చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా సినిమా గురించి మెగా అభిమానులు చాలా ఆశతో ఎదురుచూస్తున్నారు. దాదాపు ఏడాదికి పైగా మెగా కాంపౌండ్ నుండి పెద్ద హీరోల సినిమా ఏది కూడా విడుదల అవని నేపథ్యంలో ‘సైరా’ సినిమా పై చాలా అంచనాలు మెగా అభిమానులు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో సినిమాలో కూడా భారీ తారాగణం ఉండడంతో భారీ స్థాయిలో నిర్మాత రామ్ చరణ్ ట్రైలర్ రిలీజ్ ని ఎంచుకున్నట్లు సమాచారం. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..ఖతార్ లోని దోహా వేదికగా వచ్చే నెల 15 మరియు 16 తేదీలలో జరగనున్న సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)వేదికపై ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయనున్నారని సమాచారం. హిందీతో పాటు సౌత్ లోని పలు భాషలలో విడుదల కానున్న సైరా మూవీ ట్రైలర్ ని ఇలాంటి అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రమోట్ చేయడం సినిమాకు అనుకూలించే అంశమే అని చెప్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పక్కన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు,విజయసేతుపతి,అమితాబ్,తమన్నా వంటి స్టార్ కాస్ట్ ఇతర ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి నాడు సినిమా విడుదల చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు సినిమా యూనిట్ వారు.

Latest News

view all