బిగ్ బాస్ 3 హౌస్ లో వారి పైన నిఘా ఉండబోతోంది?

By Siddhu Manchikanti, July 24, 2019 14:41 IST

బిగ్ బాస్ 3 హౌస్ లో వారి పైన నిఘా ఉండబోతోంది?
 
బిగ్ బాస్ 3 హౌస్ లో మొదటి రోజు నుండే బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య పోటీతత్వం ఉండేలా నామినేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. దీంతో ఈ సీజన్ స్టార్టింగ్ నుండే రసవత్తరంగా మారటంతో తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు బిగ్ బాస్ 3 కార్యక్రమాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించిన...శివజ్యోతి, రవికృష్ణ, ఆశూరెడ్డిలను తప్ప మిగితా ఇంటి సభ్యులను ఎంట్రీలోనే ప్రశ్నలు అడిగారు… అయితే అందులో సరైన సమాదానాలు చెప్పని ఆరుగురి పేర్లు చెప్పాలని, బిగ్‌బాస్ ఆదేశించారు. ఇదిలావుండగా తాజాగా రాహుల్, వరుణ్ సందేశ్, వితికాశేరు, శ్రీముఖి, బాబా బాస్కర్, జాఫర్‌లు ఈవారం నామినేషన్ అవ్వడం తెలిసిందే.
 
కాగా వీరికి నామినేషన్ నుండి తప్పించుకునేందుకు ఇచ్చిన బిగ్ బాస్, అందులో కూడా వీరికి ఒక మెలిక పెట్టాడు. తనకు బదులుగా ఇంకో ఇంటి సభ్యుణ్ని నామినేట్ చేయాలని చెప్పారు. కాకపోతే వారందరికీ కూడా సరైన కారణాలు చెప్పాలని, అలా అయితేనే సమ్మతం తెలుపుతామని బిగ్ బాస్ అన్నారు. తాజాగా బిగ్బాస్ ఇచ్చిన ఈ ఫస్ట్ టాస్క్ మొత్తాన్ని మానిటరింగ్ చేయడానికి హేమను నియమించడం జరిగింది. అయితే మరోపక్క హౌస్ లో సరిగ్గా పనుల విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించడం లేదంటూ హేమ హిమజ ల మధ్య చిన్నవార్ స్టార్ట్ కావడం షో పై కొంత ఇంట్రెస్టింగ్ కనిపించింది. దీన్ని బట్టి చూస్తుంటే మొత్తం మీద హౌస్ లో రూల్స్ పాటించని వారిపై ప్రత్యేకమైన నిఘా బిగ్ బాస్ పెట్టినట్లు అర్థమవుతుంది.

Latest News

view all