ఎబి వెంకటేశ్వరరావు పై ప్రశ్నల వర్షం కురిపించిన విజయసాయిరెడ్డి..!

By Xappie Desk, April 20, 2019 17:20 IST

ఎబి వెంకటేశ్వరరావు పై ప్రశ్నల వర్షం కురిపించిన విజయసాయిరెడ్డి..!
 
వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎబి వెంకటేశ్వరరావు పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రానికి ఏమైనా చేశారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా విధులకు నిర్వహించక ముందు రాజ్యాంగం సాక్షిగా చేసిన ప్రమాణం గుర్తుందా అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.
 
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, చిత్తశుద్ధితో, నిష్పక్షపాతంగా ఉంటానని ఐపీఎస్ శిక్షణ సమయంలో చేసిన ప్రమాణం గుర్తుందా అని విజయసాయి రెడ్డి మాట్లాడుతూ...ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి జీతం తీసుకుంటూ చంద్రబాబుకు ఊడిగం చేశారని, ఇంటెలిజెన్స్ చీఫ్ గా మీరు ప్రజల కోసం చేసిన సేవ ఏమైనా ఉందా?..అని ఆయన అన్నారు. ‘ఎన్నికలంటే ఏంటి? ఎవరో డబ్బు ఏర్పాటు చేస్తారు. ఇంకొకరు ఖర్చుచేసి గెలుస్తారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు జరిగేది ఇలాగే గదా’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరూ మర్చిపోలేదని, ఈ పెద్ద మనిషి ప్రజాస్వామ్యాన్ని ఈసీ పరిహాసం చేసిందని దేశమంతా తిరుగుతూ రంకెలు వేస్తున్నాడని ఆయన అన్నారు. తాజాగా జరిగిన ఎన్నికలలో ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్పారు అంటూ విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు.

Tags:

  • Ys Jagan
  • YSRCP
  • V Vijayasai Reddy
  • AB Venkateswara Rao

Latest News

view all