ముఖ్యమంత్రి హోదా లో మొట్ట మొదటి సారి పోలవరానికి వెళ్లిన జగన్..!

By Xappie Desk, June 21, 2019 10:31 IST

ముఖ్యమంత్రి హోదా లో మొట్ట మొదటి సారి పోలవరానికి వెళ్లిన జగన్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు వైయస్ జగన్. ముందుగా వైయస్ జగన్ హెలికాప్టర్ లో పోలవరం వెళ్లి ముందుగా ఏరియల్ సర్వే చేశారు. ఎపికి జీవనాడిగా పరిగణించే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలన్నది తమ ప్రాదాన్యత అని జగన్ చెబుతూ వస్తున్నారు.
 
అదికారులు ఈ ప్రాజెక్టుకు ఇంకా రెండేళ్లు పడుతుందని చెబుతున్నారు. కేంద్రం పూర్తిగా నిదులు ఇవ్వవలసిన ఈ ప్రాజెక్టు వ్యవహారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య గత ముఖ్యమంత్రి చంద్రబాబు టైమ్ లో వివాదాస్పదంగా మారింది. ప్రాజెక్టు వ్యయ అంచనా, ఇతర సమస్యలు జగన్ ముందు ఉన్నాయి. కాగా శుక్రవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానం మేరకు కాళేశ్రం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లనున్న జగన్ ముందుగా పోలవరం సందర్శించి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా రాబోయే నాలుగు నెలల్లో ఎటువంటి పనులు అధికారులు చేయబోతున్నారు వంటి విషయాలను తెలుసుకున్నారు జగన్. ఈ సందర్భంగా జగన్ వెంట నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలాగే ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

Latest News

view all